తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి వెల్లడించారు. మార్చి 3 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని అన్నారు. మే 7 నుంచి 11 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు చైర్మన్ లింబాద్రి పేర్కొన్నారు.
* నోటిఫికేషన్ తేదీ : 28-02-23
* ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ తేదీ : 03-03-2023
* ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ : 30-04-2023
* ఆన్లైన్ దరఖాస్తుల్లో మార్పులు చేసుకునే తేదీ : 02-05-23 నుంచి 04-05-23 వరకు
* రూ. 250 ఆలస్య రుసుముతో ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 05-05-23
* రూ. 500 ఆలస్య రుసుముతో ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 10-05-23
* రూ. 2500 ఆలస్య రుసుముతో ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 15-05-23
* రూ. 5000 ఆలస్య రుసుముతో ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 24-05-23
* 21-05-23 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
పరీక్షా తేదీలు 29 05 23 నుంచి 01 06 23 వరకు నిర్వహించనున్నారు. మే 7,8, 9 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు. మే 10, 11న అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12వరకు మొదటి సెషన్ పరీక్ష, మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6వరకు రెండవ సెషన్ పరీక్ష జరుగనుంది. ఇక ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు ఎంసెట్ ఫీజు రూ.500లు. ఇతర విద్యార్థులకు ఎంసెట్ ఫీజు రూ. 900లు. ఈసారి ఎంసెట్ ద్వారానే బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్ జరుగనున్నాయి. ఈసారి కూడా ఎంసెట్ లో ఇంటర్ వేయిటేజీ లేదు.