స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ కిట్ అందించిన దాస్యం

స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ కిట్ అందించిన దాస్యం

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్య-వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఈరోజు హనుమకొండ మర్కాజి మరియు ప్రాక్టీసింగ్ పాఠశాలలో విద్యార్థులకు అభ్యాసన దీపికలు మరియు ఎగ్జామ్ కిట్స్ ను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఆయన తెలిపారు. విద్యార్థుల విజ్ఞానానికై అభ్యసన దీపికాలు అందిస్తున్నామని తెలుపుతూ ఈరోజు విద్యార్థుందరికీ పరీక్షలు రాయడానికి అవసరమయ్యే పరికరాలను అందించిన సంతోష్ కి అభినందనలు తెలిపారు.

‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమములో భాగంగా 12రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంద అన్నారు. అదే సమయంలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు స్వయంగా తానే భోజనాన్ని వడ్డించి, వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేయడం చాలా సంతోషాన్ని కల్గించిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చెన్నం మధు, సోద కిరణ్, ఎలకంటి రాములు, జిల్లా విద్యాధికారి అబ్దుల్ హై మరియు తదితరులు పాల్గొన్నారు.