మూడు రోజులు నీటి సరఫరా బంద్
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఫిబ్రవరి 28,మార్చి 1, మార్చి 2 తేదీల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు బల్దియా ఈఈ బీఎల్ శ్రీనివాస్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ధర్మసాగర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద గల 60 ఎంఎల్డీ పైప్ లైన్ లకు సంబంధించిన పనులు మిషన్ భగీరథ అధికారులచే నిర్వహించనున్న క్రమంలో 3 రోజులు బల్దియా పరిధిలోని వరంగల్ అండర్ రైల్వే జోన్ పరిధిలో గల అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపి వేయబడుతుందని తెలిపారు.
దీంతో ఈ ఏరియాలో నీటి సరఫరా ఉండదని తెలిపారు. ఇట్టి ఫిల్టర్ బెడ్ల పరిధిలో 3 రోజుల పాటు నీటి సరఫరా జరగదన్నారు. కావున ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి సహకరించాలని బల్దియా ఈఈ బీఎల్ శ్రీనివాసరావు నేడొక ప్రకటనలో తెలిపారు.