512కిలోల ఉల్లిగడ్డలు అమ్మితే వచ్చింది రూ.2

512కిలోల ఉల్లిగడ్డలు అమ్మితే వచ్చింది రూ.2

వరంగల్ టైమ్స్, మహారాష్ట్ర : సోలాపూర్ కు చెందిన రాజేంద్ర చవాన్ అనే రైతుకు చేదు అనుభవం ఎదురైంది. ఈ నెల 17న 10 బస్తాల ఉల్లిగడ్డలను మార్కెట్ కు తీసుకువచ్చాడు. అయితే ధర లేదని చెప్పిన వ్యాపారులు, రూపాయికి కిలో చొప్పున ఉల్లిని కొన్నారు. మొత్తం 512 కిలోల ఉల్లిగడ్డలకు రూ. 512 రాగా అందులో రవాణా, కూలీ, ఇతర ఖర్చుల కింద రూ. 509.51 పోయాయి. రూ. 2. 49 మిగలగా రౌండ్ ఫిగర్ గా 2 రూపాయల చెక్కును రైతుకు ఇచ్చారు. దీంతో బాధిత రైతు కన్నీళ్లపర్యంతమయ్యారు.