ప్లాస్టిక్ నిషేధంపై టీటీడీ మరో ప్రయత్నం

ప్లాస్టిక్ నిషేధంపై టీటీడీ మరో ప్రయత్నం

వరంగల్ టైమ్స్,తిరుమల: పర్యావరణ పరిరక్షణలో భాగంగా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలు చేసే విధంగా మరో నిర్ణయంతీసుకుంది టీటీడీ. తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా టీటీడీ మరో ప్రయత్నం చేస్తోంది. శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని ఇక నుంచి తాటాకు బుట్టల్లో భక్తులకు అందించే ఆలోచనలో ఉంది. తిరుమలలో వాతావరణ కాలుష్యాన్ని కట్టడి చేసేలా తాటాకు బుట్టలను ప్రయోగత్మకంగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్లాస్టిక్ నిషేధంపై టీటీడీ మరో ప్రయత్నం.. ఇక నుంచి లడ్డు ప్రసాదాన్ని తాటాకు బుట్టలో అందించే ప్రయత్నం