వాళ్ళు మరోసారి కలవబోతున్నారు..!!

వాళ్ళు మరోసారి కలవబోతున్నారు..!!

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సినీ నటుడు నందమూరి తారకరత్న పెద్ద కర్మ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు తేదీ ఖరారు చేశారు. మార్చి 2న తారకరత్న పెద్ద కర్మ జరగనుంది. హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో మార్చి 2న మధ్యాహ్నం 12 గంటల నుంచి పెద్ద కర్మ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పెద్ద కర్మ కార్యక్రమం గురించి తెలియజేయడానికి కుటుంబ సభ్యులు కార్డును ముద్రించారు.

కార్డుపై శ్రేయోభిలాషులుగా తారకరత్న చిన్నాన్న నందమూరి బాలకృష్ణ, తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి, పెదనాన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పేర్లను ముద్రించారు. అయితే కార్డుపై విజయసాయి రెడ్డి పేరు పెట్టడంతో ఈ కార్యక్రమం ద్వారా మరోసారి వీరు కలువబోతున్నారనేది ఆసక్తిగా మారింది.