సచివాలయ ఉద్యోగులకు యూనిఫాం తప్పనిసరి

సచివాలయ ఉద్యోగులకు యూనిఫాం తప్పనిసరి

వరంగల్ టైమ్స్, సోమందేపల్లి (శ్రీ సత్యసాయి జిల్లా) : సచివాలయ ఉద్యోగులు యూనిఫామ్ ఖచ్చితంగా ధరించాలని జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. బుధవారం సోమందేపల్లి మండలంలోని గుడిపల్లి గ్రామ సచివాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. గ్రామంలో నిర్మిస్తున్న గ్రామ సచివాలయ భవనం పూర్తయ్యే దశలో ఉందని, దానిని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రం భవనం పూర్తికాగా సిద్ధం చేయాలన్నారు.సచివాలయ పరిధిలో చేపట్టాల్సిన స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకోవాలన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డుకు సంబంధించి సర్వే ని వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సచివాలయంలో రిజిస్టర్ లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ వెంకటేశ్వర్లు, సర్పంచ్ గిరిజమ్మ, సచివాలయ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.