పవన్ కామెంట్లపై స్పందించిన సోము వీర్రాజు
వరంగల్ టైమ్స్, మచిలీపట్నం : జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మచిలీపట్నం వేదికగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో పొత్తులపై ఆసక్తికర కామెంట్లు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇక పవన్ కల్యాణ్ కామెంట్లపై స్పందించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో జిల్లా స్థాయి బీజేపీ బూత్ స్వశక్తి కిరణ్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న సోము వీర్రాజు ఈ సందర్భంగా మాట్లాడారు. జనసేన, టీడీపీ పొత్తుపై పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడలేదని గుర్తుచేశారు. పవన్ బీజేపీతో పొత్తుపైనే మాట్లాడడం జరిగిందని గుర్తు చేశారు. ఆయన టీడీపీతో పొత్తుపై జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చిన తర్వాత తమ భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తాం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సోము వీర్రాజు.