బండి సంజయ్ కి మహిళా కమిషన్ వార్నింగ్
warangaltimes, హైదరాబాద్ : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ శనివారం తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పై అనుచిత వ్యాఖ్యలు పట్ల బండి సంజయ్ మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యాడు. ఈ సందర్భంగా బండి సంజయ్ ను దాదాపు రెండున్నర గంటల పాటు మహిళ కమిషన్ విచారించింది.పొలిటికల్ గా, ఇంకా ఏ విధంగానైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని బండి సంజయ్ ను మహిళా కమిషన్ గట్టిగా నిలదీసినట్లు సమాచారం.
మహిళ పట్ల పలు సందర్భాల్లో బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వీడియోల రూపంలో చూపించి మరీ విచారణ చేసింది మహిళా కమిషన్. బతుకమ్మను, మహిళలను లంగలు, దొంగలు అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలను కూడా వీడియో లు చూపిస్తూ మహిళా కమిషన్ విచారణ చేసినట్లు సమాచారం. భవిష్యత్తులో మహిళల పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదంటూ బండి సంజయ్ ని మహిళా కమిషన్ ఆదేశించింది.
అనంతరం మహిళా కమిషన్ ఎదుట బండి సంజయ్ సంజాయిషీ ఇచ్చుకున్నట్లు సమాచారం. అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు తప్ప, తాను ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యానించలేదని తెలిపినట్లు సమాచారం. ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వ్రాత పూర్వకంగా బండి సంజయ్ వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో కవితను తాను అక్కగా సంబోధించినట్లు బండి సంజయ్ మహిళా కమిషన్కు చెప్పినట్లు సమాచారం.
బండి సంజయ్ సంజాయిషీని వ్రాతపూర్వకంగా తీసుకున్న మహిళా కమిషన్ మరొకసారి ఆయనను విచారించే అవకాశం ఉందని సమాచారం. మహిళలపై మరోసారి సామెతలను ప్రయోగించొద్దంటూ కమిషన్ ఆదేశించినట్లు సమాచారం. మరోసారి ఇలా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని బండి సంజయ్ ని మహిళా కమిషన్ హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎవ్వరైనా మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం.