చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు రిమాండ్ ను ఏసీబీ కోర్టు పొడిగించింది. అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశించింది. కస్టడీలో చంద్రబాబు చాలా ప్రశ్నలకు సమాధానాలు దాట వేశారని రిమాండ్ తో పాటు కస్టడీని పొడిగించాలని సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు. దీనిపై చంద్రబాబు తరపు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అయినప్పటికీ సీఐడీ వాదనను కోర్టు ఏకీభవించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఇప్పటికే తొలి రిమాండ్ ముగిసింది. అటు సీఐడీ అధికారులు కూడా రాజమండ్రి జైలులోనే కస్టడీకి తీసుకుని చంద్రబాబును విచారించారు. కస్టడీ ముగియడంతో చంద్రబాబును వర్చువల్ గా జైలు నుంచే ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపర్చారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు, చంద్రబాబు రిమాండ్ పొడిగించింది.