గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై కిషన్ రెడ్డి ఫైర్

గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై కిషన్ రెడ్డి ఫైర్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్: తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనాతీరుపై రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ను హైకోర్టు మళ్లీ రద్దు చేయడంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పులు చేసి నిరుద్యోగులు కోచింగ్ తీసుకున్నారు. మొదటిసారి గ్రూప్-1 పరీక్ష పేపర్ లీక్ కావడం వలన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ మళ్లీ రద్దు చేయడంపై సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం నరక కూపంగా మారిందని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనా తీరు పట్ల నిరుద్యోగులు ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఫైర్ అయ్యారు. పరీక్షలు నిర్వహించలేని స్థితితో కేసీఆర్ సర్కార్ ఉందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.