2028 నుంచి ఒలింపిక్స్ లో క్రికెట్..
వరంగల్ టైమ్స్,స్పోర్ట్స్ డెస్క్: ఎప్పుడెప్పుడు విశ్వక్రీడల్లో క్రికెట్ ను చూస్తామా అని ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఒలింపిక్స్ లో క్రికెట్ పున:ప్రవేశానికి ఆమోదం లభించింది.అభిమానుల ఆశలు మరో ఐదేళ్లలో నెరవేరబోతున్నాయి.అక్టోబర్ 13న ఐవోసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశమైంది. లాస్ ఏంజిల్స్ వేదికగా 2028లో జరిగే విశ్వక్రీడల్లో క్రికెట్ ను భాగం చేసేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆమోదం తెల్పింది.క్రికెట్ తో పాటు సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్ బాల్, లాక్రోస్సె, స్కాష్ ను ఒలింపిక్స్ లో భాగం చేయబోతున్నట్లు తెలిపింది.
ఈ మేరకు ఆదివారం నుంచి ముంబైలో మొదలైన ఐవోసీ సెషన్స్ లో ఈ ప్రతిపాదనను సభ్యుల ముందు ఉంచి ఓటింగ్ చేపట్టింది. ఈ ఓటింగ్ లో 2028 నుంచి ఒలింపిక్స్ లో క్రికెట్ ప్రవేశం ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీంతో లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో పురుషుల, మహిళల క్రికెట్ జట్లు టీ 20 ఫార్మాట్ లో బరిలోకి దిగనున్నాయి. ఇన్ని యేండ్లు వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫి, ఆసియాకప్ లాంటి వాటికి పరిమితమైన టీమిండియా ఇప్పుటు ఒలింపిక్స్ లోనూ పోటీ పడనుంది.