బీజేపీకి ఒక విజన్ లేదు : రాకేష్ రెడ్డి

బీజేపీకి ఒక విజన్ లేదు : రాకేష్ రెడ్డి

-బీఆర్ఎస్ లో చేరిన ఏనుగుల రాకేష్ రెడ్డి
-బీజేపీలో యువతకు ప్రాధాన్యత లేదు
-బీజేపీలో డబ్బున్నోళ్లకే ప్రాధాన్యత ఇస్తారు
-పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని బీజేపీలో చేరా:రాకేష్ రెడ్డి
-లక్ష్యం అనేది ఉంటే ఆ దేవుడే దారి చూపిస్తాడు
-రామన్న ఒక విజన్ ఉన్న నాయకుడు
-3వ సారి బీఆర్ఎస్ గెలుపుకు కృషి చేస్తా

వరంగల్ టైమ్స్,హైదరాబాద్: బీజేపీకీ ఒక విజన్ లేదు, ఎజెండా లేదు అని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి విమర్శించారు.11 యేండ్లు పార్టీ కోసం కష్టపడినా పట్టించుకోకపోవడంతో నిరాశ చెందిన రాకేష్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో శనివారం బీఆర్ఎస్ లో చేరారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రాకేష్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏనుగుల రాకేష్ రెడ్డితో పాటు వరంగల్ కు చెందిన మాదాసు వెంకటేష్, బక్కా నాగరాజు తదితరులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘన్ పూర్ అభ్యర్థి కడియం శ్రీహరి,జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడాడు. బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్, భవిష్యత్ తెలంగాణ నిర్మాత కేటీఆర్ అని కొనియాడారు. వారి సారథ్యంలో బీఆర్ఎస్ లో చేరుతున్నందుకు సంతోషపడుతున్నానని రాకేష్ రెడ్డి అన్నాడు.

బీజేపీలో యువతకు ప్రాధాన్యత లేదని, ప్రతిభకు స్థానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజాబలం ఉన్న నాయకుల కంటే డబ్బులున్న వారికే గుర్తింపు ఉందన్నారు. తేజస్వి సూర్యను చూపించి యువకులకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పి దేశమంతా ప్రచారం చేస్తారు.తెలంగాణకు కూడా, వరంగల్ కూడా ప్రతి జిల్లాకు సూర్య కావాలని ఆలోచన లేదు. కానీ బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో యువ నాయకులు ఎమ్మెల్యేలు, మేయర్లు, జడ్పీ చైర్ పర్సన్లు అయ్యారు.పుట్టిన గడ్డకు రుణం తీర్చుకోవాలని, ప్రజాసేవకు అంకితం కావాలని 11 యేళ్ల క్రితం అమెరికాలో ఉన్నత ఉద్యోగం వదిలేసి వరంగల్ గడ్డ మీద అడుగుపెట్టి బీజేపీలో చేరాను. నాటి నుంచి మొన్నటి వరకు పార్టీయే ప్రాణంగా, కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించి ప్రజలకు అంకితమై సేవలందించానన్నారు. ఎన్నో కార్యక్రమాలు, పోరాటాలు చేసి,బీజేపీని ప్రతీ ఇంటికి తీసుకెళ్లానని అన్నారు.బీజేపీలో పని తనానికి ప్రాధాన్యత లేదు కాబట్టే రాజీనామా చేశానని రాకేష్ రెడ్డి తెలిపారు. కొట్లాది తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న తెలంగాణ వాదానికి కేసీఆర్ రూపురేఖలు ఇచ్చారని రాకేష్ రెడ్డి అన్నారు. తెలంగాణకు ఎప్పుడు ఏం అవసరమో, ఎప్పుడు ఏం చేయాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు.ఆ రకంగా గత 11 యేళ్లుగా సంపూర్ణమైన అవగాహనతో తెలంగాణను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. శాశ్వత పనులకు శ్రీకారం చుట్టారని అన్నారు. కేటీఆర్ ఒక దూరదృష్టితో నిర్మాణాత్మకంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్తూ, ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీని విస్తరించారని కొనియాడారు.

రామన్నను కొద్ది రోజుల క్రితం కలిసినట్లు రాకేష్ రెడ్డి తెలిపారు.2 నిమిషాలు మాట్లాడి పంపిస్తరు అనుకున్న,కానీ 40 నిమిషాలు మాట్లాడి నా నేపథ్యం తెలుసుకున్నారు. చాలా ఫ్రాంక్ గా మాట్లాడారు. వారి మనస్తత్వం చేసిన తర్వాత ఇలాంటి నాయకుడి తోటి ప్రయాణం చేయాలని భావన కల్గింది.బీజేపీలో 11 యేండ్లు అగ్ర నాయకులతో పని చేశాను. కానీ 40 నిమిషాలు టైం ఇచ్చి నా నేపథ్యాన్ని కనుగొన్న నాయకుడు ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశాడు.రామన్న ఒక విజన్ ఉన్న నాయకుడు, అందుకే భవిష్యత్ తెలంగాణ నిర్మాత కేటీఆర్ అని రాకేష్ రెడ్డి కొనియాడారు.నాకు బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో కార్యకర్తలు బాధపడ్డారు.బీజేపీలో చాలా కష్టపడ్డాను. అయినా బీజేపీ అధినాయకత్వం పట్టించుకోలేదు. బాధపడుతున్న తమను ఎవరూ మందలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి నన్ను అక్కున చేర్చుకున్నారని అన్నారు. ప్రశ్నించే గొంతుకను పాలనలో భాగస్వామ్యం చేయాలని నన్ను ఆహ్వానించారు. మూడోసారి బీఆర్ఎస్ విజయం సాధించేందుకు అన్ని రకాలుగా పనిచేస్వానని రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు.