అసమర్ధ పాలనకు చరమగీతం పాడుదాం: ఎర్రబెల్లి
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : అభివృద్దిలో పరుగులు పెడుతున్న బీజేపీకి ఓటెయ్యాలని వరంగల్ తూర్పు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. డివిజన్ 34లోని పద్మావతి ఫర్నిచర్స్, పల్లవి హాస్పిట్, స్పుత్నిక్ స్కూల్, శ్రీరామ టెంపుల్, గవర్నమెంట్ స్కూల్, ఖమ్మం బైపాస్ రోడ్ ప్రాంతాల్లో ఎర్రబెల్లి ప్రదీప్ రావు విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్బంగా ప్రదీప్ రావు గారు మాట్లాడారు. రోజు రోజు కు బీజేపీ పార్టీ మరింత బలపడుతుందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తూర్పు ప్రాంతంలో మనుగడ లేదని అన్నారు. ఒక కొత్త నాయకుడిని, బీజేపీ పార్టీని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. 40 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన, పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూసి ప్రజలు విసుగు చెందారని అన్నారు. అవినీతి అక్రమాలు, అసమర్ధ పాలనకు తూర్పు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈసారి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, వరంగల్ అభివృద్ధిని కోరుకుందాం అని అన్నారు.
అవినీతి అక్రమ ఆస్తుల సంపాదించుకొని మళ్లీ ఓటర్లను మభ్యపెట్టి మద్యం డబ్బుతో ప్రజలను కొనాలని ఇద్దరు నాయకులు చూస్తున్నారని, వారికి మీ ఓటుతో ఈసారి బుద్ధి చెప్పాలని కోరారు. ఒకసారి నియోజకవర్గంలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని నరేంద్ర మోడీ సంక్షేమ పాలనను అవినీతి రహిత పాలన తీసుకు వద్దామని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలన్నింటిలో కేంద్రం వాటా ఉంటున్నదన్న విషయాన్ని గమనించాలని కోరారు. బీజేపీ గెలిస్తే సంక్షేమ పథకాలు కానీ, డబుల్ బెడ్ రూం ఇండ్లు అర్హులకు మాత్రమే అందే విదంగా చూస్తానన్నారు. పైరవీలకు తావివ్వనని హామీ ఇచ్చారు. ప్రతీ సామాన్యుడు తన వద్దకు ఇతరుల ప్రమేయం లేకుండా నిర్భయంగా వచ్చి తమ కష్టాలు, సమస్యలు చెప్పుకోవచ్చన్నారు. తూర్పు నయోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.