అభివృద్ధి,సంక్షేమానికి ఓటేయండి : దాస్యం

అభివృద్ధి,సంక్షేమానికి ఓటేయండి : దాస్యం

-బీఆర్ ఎస్ కు 100 సీట్లు పక్కా
-వడ్డేపల్లి గ్రామం నుండి భారీ మెజారిటీ రావాలి
-మీకు సేవకుడిగా పని చేస్తా-చీఫ్ విప్ దాస్యం

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 60వ డివిజన్ లో ప్రభుత్వ చీఫ్ మరియు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడారు. ఒకవైపు అభివృద్ధి,ఒకవైపు సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీని చూసి ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. కేసీఆర్ భరోసా ద్వారా అనేక బృహత్తర కార్యక్రమాలకు రూప కల్పన చేయడం జరిగిందన్నారు.

వంటింటి గ్యాస్ తో బాధపడుతున్నటువంటి వారికి రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకాన్ని, సౌభాగ్య లక్ష్మి కింద మహిళలకు నెలకు రూ.3000, 93 లక్షల మంది తెల్ల రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి కేసీఆర్ బీమాను రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అమలు చేస్తామని అన్నారు.ఇప్పటికే ఈ నగరం ఐటీ హబ్ గా,ఎడ్యుకేషనల్ హబ్ గా, కల్చరల్ హబ్ గా మార్చడం జరిగిందన్నారు.పశ్చిమ నియోజకవర్గంలో రూ.5వేల కోట్ల నిధులతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామని అన్నారు.

జంక్షన్ల అభివృద్ధి,కాళోజి కళాక్షేత్రం, 66 కాలనీలలో 66 పార్కులను నిర్మించడం జరిగిందన్నారు. పట్టణ సుందరీకరణ,నాలాల అభివృద్ధి పనులు కూడా చేశామన్నారు.ఇలా అనేక అభివృద్ధి పనులు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని అందరూ ఆదరించి, భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ ఎస్ పార్టీ 100 సీట్లు గెలవడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. అందులో నేను ఒక్కడిని అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అభినవ్ భాస్కర్, మాజీ కార్పొరేటర్ కేశబోయిన అరుణ శ్రవణ్ కుమార్,నాయకులు వేణు, నాగరాజు తో పాటు తదితరులు పాల్గొన్నారు.