అక్రమంగా తరలిస్తున్న బెల్లం పట్టివేత
వరంగల్ టైమ్స్, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లపూర్ చెక్ పోస్టువద్ద ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే అనుమానాస్పదంగా కనిపించిన టాటా సుమో వాహనాన్ని ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేశారు.దీంతో రూ. 50వేల విలువ చేసే అక్రమంగా తరలిస్తున్న 720 కిలోల బెల్లంను స్వాధీనం చేసుకున్నారు. టాటా సుమో వాహనంతో పాటు, 2 సెల్ పోన్లను స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీ కోసం అక్రమంగా బెల్లంను తరలిస్తున్న నలుగురిలో అజ్మీర సారయ్య, అజ్మీర సమ్మయ్య, అజ్మీరరాజు లను అదుపులోకి తీసుకున్నారు. నాలుగో వ్యక్తి మేడారం బెల్లం వ్యాపారి సిద్ధబోయిన సాంబశివరావు పరారిలో ఉన్నట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.