పన్నుల వసూళ్ళలో జీడబ్ల్యూఎంసి రికార్డు

పన్నుల వసూళ్ళలో జీడబ్ల్యూఎంసి రికార్డు

వరంగల్ టైమ్స్, గ్రేటర్ వరంగల్ : 2020-21 ఆర్థిక సంవత్సరానికి ముందస్తు పన్నుల చెల్లింపులో రికార్డ్ స్థాయిలో 19.50 కోట్ల రుపాయలు సేకరించిన ఘనత వరంగల్ మహానగరపాలక సంస్థకు దక్కింది. గత సంవత్సరం 5 శాతం తగ్గింపుతో ముందస్తు పన్నుల వసూలులో 12 కోట్ల రూపాయలు సేకరించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవగా, ఈ సంవత్సరం కూడా 20 కోట్ల రూపాయలు సేకరించి వరుసగా రెండవ సారి రాష్ట్రంలోనే జి.డబ్ల్యు.ఎం.సి. అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ ఉన్నప్పటికీ పన్నుల అధికారి శాంతికుమారి ఆధ్వర్యంలో పన్నుల విభాగం సిబ్బంది అహర్నిశలు కృషి చేసి పన్నులు సేకరించడం వల్లే మరోసారి ముందస్తు పన్నుల చెల్లింపులో రాష్ట్రంలో మరోసారి అగ్రస్థానాన్ని గెలుచుకుందని నగర మేయర్ గుండా ప్రకాష్ రావు, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి లు అన్నారు. ముందస్తు పన్నుల వసూళ్ళు చేసిన సంబంధిత అధికారులను మేయర్ గుండా ప్రకాష్ రావు, కమిషనర్ పమెలా సత్పతి అభినందించారు.