బ్యాట్ పడితే బంతి బౌండరీనే..
తనదైన శైలి లో బ్యాటింగ్ చేసిన మంత్రి హరీశ్‌రావు
12 బాల్స్ లో 18 పరుగులు చేసిన మంత్రిసిద్ధిపేట జిల్లా: నిన్నటి దాకా ఎన్నికల హడావిడిలో ఉన్న మంత్రి హరీష్ రావు ఆటవిడుపు గా సిద్దిపేట లో ఫ్రెండ్లి క్రికెట్ మ్యాచ్ లో పాల్గొని సిద్ధిపేట క్రికెట్ అసోసియేషన్ కెప్టెన్సీ గా వ్యహరించారు.. అయితే తన టీమ్ 3 వికెట్లు కోల్పోయిన సమయంలో మంత్రి హరీష్ రావు బ్యాటింగ్ తో గ్రౌండ్ లోకి ఎంటరయ్యారు.. గ్రౌండ్ లో ఎంటర్ అవుతూనే బంతిని బౌండరీ ల వైపు పరుగులు పెట్టించారు. బ్యాంటింగ్ తన దైన శైలి లో చేస్తూ సునాయాసంగా పరుగులు తీస్తూ వరుసగా రెండు ఫోర్లను కొట్టాడు. 12 బాల్స్ లో 18 పరుగులు చేసి ఔటయ్యారు. హరీష్‌రావు అంటే పోలిటికల్ లీడరే కాదు. ఏదైనా తన సరే తనకంటూ ఒక ముద్ర ఉండాల్సిందే .గెలుపు కొరకు పట్టు వదలని విక్రమార్కుడిలా కృషి చేస్తారు. అదే తరహాలో తన కెప్టెన్సీ లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ ను అదే పంథాలో వ్యవహరించారు. బ్యాటింగ్ చేస్తూ అభిమానులను, ప్రేక్షకులను కేరింతలు పుట్టించేలా పరుగుల వరద కురిపించారు.. కొద్దీ బాల్స్..కొద్దీ నిముషాలు అయినప్పటికీ అంతే స్థాయిలో పరుగులు తీయడంలో మరో సారి తన క్రీడా స్పూర్తిని చాటుకున్నారు.