హైదరాబాద్: ఒక సారి కరోనా వచ్చిందంటే మళ్లీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని వైద్యులు చెప్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోతుంది. అసలే చలికాలం , అప్పటికే కరోనాతో వణికిపోతున్న జనం కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నప్పటికీ ఆ మహమ్మారి బారిన పడక తప్పడం లేదు..పైగా అప్పటికే కోవిడ్ తో సఫరైన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారులకు రెండో సారి కోవిడ్ అటాక్ అయ్యింది. వీరిలో నలుగురు సెక్టార్ ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లు, మరో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు వున్నారు. వీరందరూ గత జూన్ నెలలో కోవిడ్ బారిన పడిన వారే..అయితే వీరికి రెండో సారి కోవిడ్ పాజిటివ్ రావడంతో ఎస్ ఆర్ నగర్ పోలీసులు భయాందోళనకు గురవుతున్నారు.