హైదరాబాద్: అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ రూపొందించిన టీకాను బ్రిటన్ పంపిణీ ప్రారంభించింది. మొదటగా తొలి టీకాను 90 ఏళ్ల వృద్ధురాలు మార్గరేట్ కీనస్కు ఇచ్చారు. నార్త్ ఐర్లాండ్‌లోని ఎన్నిస్కిల్లెన్ ప్రాంతానికి చెందిన బామ్మకు ఈ టీకాను వేశారు. దీంతో ప్రపంచంలోనే మొదటిసారిగా ఫైజర్ బయోఎన్‌టెక్ కోవీడ్ టీకాను తీసుకున్న వ్యక్తిగా ఆమె గుర్తింపు పొందారు. ఈ టీకా తన జన్మదినం గిఫ్ట్‌గా భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. తొలుత 80 ఏళ్లు దాటి కోవిడ్‌కు గురయ్యేవారికి ఈ టీకాను ఇవ్వనున్నట్లు ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. ఈ సంవత్సరం చివరిలోగా 40 లక్షల మందికి టీకాను ఇవ్వాలని బ్రిటన్ భావిస్తోంది. సుమారు 8 లక్షల డోసులను ప్రభుత్వం కొన్ని వారాల్లోనే పంపిణీ చేయనున్నది.