ప్రతి పేదవాడికి అందుబాటులో ప్రభుత్వ విద్య
వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు మోహిత్ రెడ్డి
ఏ.వి.పురం ఎంపీపీ పాఠశాలలో
అదనపు తరగతి గది నిర్మాణానికి భూమిపూజతిరుపతి: ప్రతి పేదవాడికి అందుబాటులో విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే చెవిరెడ్డి తనయుడు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతి రూరల్ మండలం ఏవీపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గది నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో మోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం అదనపు తరగతి గది నిర్మాణానికి రూ.11 లక్షలు వెచ్చించినట్లు వివరించారు. ఇందుకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చొరవ తీసుకున్నారని తెలిపారు. ప్రజలకు మెరుగైన పాలన, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మోహిత్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమా మహేశ్వరి, కార్యదర్శి మాధవి వేదంతపురం సర్పంచ్ అభ్యర్థి తోట చిరంజీవి రెడ్డి, నాయకులు చంద్ర ముదిరాజ్, రవి రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, నాగరాజు రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, గంగిరెడ్డి, మురళి,పార్థ సారధి, నాగభూషణం, మధు, ప్రేమ్, గాంధీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.