తెరవెనుక ఆడియో విడుదల

తెరవెనుక ఆడియో విడుదలహైదరాబాద్: జయలక్ష్మి మురళి మచ్చ సమర్పణలో ఆయుష్ క్రియేషన్స్ పతాకంపై శ్వేతా వర్మ, సంపత్ రెడ్డి, ఆనంద చక్రవర్తిలు నటీ నటీలుగా నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర దర్శకత్వంలో ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో విశాఖ ధిమాన్, దీపిక రెడ్డి హీరోయిన్ లుగా, ఆనంద చక్రపాణి , నిట్టల శ్రీరామమూర్తి , టిఎన్ఆర్ , శ్వేత వర్మ , సంపత్ రెడ్డి నటీనటులుగా మురళి జగన్నాథ్ మచ్చ నిర్మిస్తున్న తెరవెనుక చిత్రం ఆడియో కార్యక్రమం శనివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన డి.ఐ.జి.సుమతి(ఉమెన్స్ & చైల్డ్ ప్రొటెక్షన్ సెల్) ఆడియో ను విడుదల చేయగా,దర్శకుడు శంకర్, సుచిర్ ఇండియా లయన్ కిరణ్, నిర్మాత గురురాజ్, సంఘసేవకుడు రేగొండ నరేష్, నటుడు శివారెడ్డిలు చిత్రం యొక్క పాటలను విడుదల చేశారు. అనంతరం ముఖ్య అతిథులుగా వచ్చిన డిఐజి. సుమతి ఈ చిత్రం ట్రైలర్ నన్ను ఎంతో ఆకట్టుకుందని అన్నారు. ఒక ఆడపిల్ల తండ్రి తన కూతురుకు జరిగిన అన్యాయం గురుంచి కంప్లయింట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు దానికి లేడీ పోలీస్ వివరించే విధానం బాగుంది. ఇందులో సీన్ చూస్తుంటే మహిళల పైన జరుగుతున్న అంశాలను ఇందులో చూయించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రియల్ సిచ్యువేషన్ ఏంటంటే ఇంత టెక్నాలజీ వచ్చినా అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ ఉన్నా ఇంకా తెలంగాణలో నెలకు 240 మంది అమ్మాయిలకు పైగా రేప్ , పొక్సో మరియు అభ్యుస్ కు గురౌతున్నారంటే మీరే అర్థం చేసుకోవచ్చు …ఎందుకంటే మాకు వచ్చిన రియల్ ఇన్ ఫర్మేషన్ ఏంటంటే 96 శాతం రేప్ కేసులు తెలిసిన వారే అమ్మాయిలను రేప్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మనకు స్వాతంత్య్రము వచ్చి 74 సంవత్సరాలు అయినా ప్రజల్లో పోలీస్ ల పైన ఉన్న అభిప్రాయం పోలేదు, పోలీసులు కర్కశముగా ఉంటారని, అవసరం లేకపోయినా కొడతారు, బెదిరిస్తారు అని… ఇపుడు అదంతా మారింది. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి మేము ఫ్రెండ్లీ పోలీస్ క్యాంపెన్స్ ,ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి షి టీమ్స్,,డయల్100 ,మహిళలకు సేఫ్టీ యాప్ ఇలా ఎన్నో పెట్టి అవెర్నేస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామని తెలిపారు.

అమ్మాయిలను గౌరవించేలా సినిమా,సీరియల్స్ ద్వారా యువతకు మొటివేట్ చేయగలగాలి. మహిళ పైన యునైటెడ్ నేషన్ సేర్వే చేస్తే తెలిసిన ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే తను తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మల్టి టాస్కింగ్ చేయడమేగాక తను మ్యూనికేషన్ చక్కగా చేయగలదు, ఒక విషయాన్ని డిఫ్రెంట్ వే లో ఆలోచించే క్రియేటివిటీ కూడా మహిళకు ఉంటుందని తెలిపారు. కాబట్టి ప్రతి అమ్మాయి సూపర్ కాప్ గా మారితే మనం సక్సెస్ అయినట్లు..కనుక ఇలాంటి అంశాల మీద సినిమాలు నిర్మిస్తే ప్రస్తుతం సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న వాటిని అరికట్టిన వారమవుతామని అన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో యువత యొక్క ఆశలను ,ఆశయాలకు తగ్గట్టుగా ఎలాంటి సినిమా చూడలనుకుంటున్నారో దానికి అతి దగ్గరగా వెళ్లలేక పోతున్నాడు.హాలీవుడ్ లో పెద్ద బడ్జెట్ తో చాలా చిన్న ఇన్సిడెంట్ ను తీసుకొని 1.30 నిమిషాలు ఎంత రక్తి, అనురక్తి కలిగిస్తూ.. ప్రతి మూమెంట్ మిస్ కాకుండా ప్రేక్షకుడు చూసేలా తీస్తున్నారు..అలాంటి సినిమా మనమెప్పుడు తీయగలుగుతామంటే రియల్ థింగ్ సొసైటీని గ్రాఫ్ చేసి ఆర్జిస్ట్ ప్రెజెంట్ చేయగలిగాలి అలాంటి మూవీ ఇది అవుతుందని ఆశిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున ప్రత్యేకించి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున ఈ చిత్ర దర్శక, నిర్మాత లకు మరియు ఎంటైర్ క్రూ కు ధన్యవాదాలు తెలుపుతూ చిత్రం మంచి విజయం సాధించాలని డీఐజీ సుమతి కోరారు.

నటీనటులు:
అమన్, విశాఖ ధిమాన్, దీపిక రెడ్డి హీరోయిన్ లుగా, ఆనంద చక్రపాణి , నిట్టల శ్రీరామమూర్తి , టి.ఎన్.ఆర్ ,శ్వేత వర్మ , సంపత్ రెడ్డి తదితరులు.

సాంకేతిక నిపుణులు:
కథ, మాటలు – బాబా
కెమెరా – రాము కంద,
ఎడిటర్ – బొంతల నాగేశ్వర్ రెడ్డి
మ్యూజిక్ – రఘురామ్
ఫైట్స్ – సూపర్ ఆనంద్
డాన్స్- కపిల్, శిరీష్ , అనీష్
లిరిక్స్- కాసర్ల శ్యామ్, సురేష్ బనిశెట్టి , బండి సత్యం రఘురామ్
పిఆరోఒ – మధు వి.ఆర్