హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో స్లాట్ బుకింగ్ కానీ Ptin(ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్) నెంబర్ కు ఆధార్ అవసరం లేదని చెప్పిన ప్రభుత్వం అది అమలు చేయడంలో విఫలమైందని హైకోర్టు సూచించింది. సమ్మరీ ట్రాంజక్షన్ లో కూడా ఆధార్ కార్డ్ నెంబర్ అడగడాన్ని తప్పుబట్టింది. రిజిస్ట్రేషన్‌లో ఆధార్ కార్డు కాకుండా ఏదైనా గుర్తింపు కార్డు అడగవచ్చని తెలిపింది. ఎక్కడ కూడా ఆధార్‌కార్డు వివరాలు, అమ్మేవారు, కొనేవారు, సాక్షుల వ్యక్తి గత వివరాలు సేకరించొద్దని సూచించింది. వాటిని సాప్ట్వేర్ నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రిజిస్ట్రేషన్లు యధావిధిగా కొనసాగించ్చవని సూచించింది. అయితే ఈ విషయాన్ని కేబినెట్ సబ్ కమిటీ పరిగణలోకి తీసుకుంటుందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. కాగా రిజిస్ట్రేషన్ల సవరణకు మరో వారం రోజులు సమయం ఇవ్వాలని ప్రభుత్వం కోరగా తదుపరి విచారణను వారం రోజులకు కోర్టు వాయిదా వేసింది.