నెరవేరిన గంగవ్వ కల

హైదరాబాద్​ : మై విలేజ్​ షో ప్రోగ్రామ్​ ద్వారా ఫుల్​ పేమస్​ అయిన గంగవ్వ బిగ్​బాస్​ సీజన్​-4లో కంటెస్టెంట్​గా వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. నాలుగు వారాల పాటు హౌస్​లో బాగానే ఉన్న గంగవ్వ అక్కడి పరస్థితులకు ఇమడలేక బయటికి వచ్చింది. అయితే హౌస్​ నుంచి బయటకు వెళ్లే ముందు తనకు కోరిక ఉందని నాగార్జునకు చెప్పింది. ఇళ్లు కట్టివ్వండి అని నాగార్జునను కోరింది. గంగవ్వ నోరు తెరిచి అడగడంతో తప్పకుండా కోరికను నెరవేరుస్తానని హామీ ఇచ్చాడు నాగార్జున. ఇచ్చిన హామీ ప్రకారం ఇళ్లు కూడా కట్టిస్తున్నాడని గంగవ్వ బిగ్​బాస్​ ఫినాలే రోజు చెప్పింది. గ్రాండ్​ ఫినాలేకు వచ్చిన గంగవ్వను ఎలా ఉన్నావు గంగవ్వ, బిగ్​బాస్​ తర్వాత నీ జీవితం ఎలా ఉంది అని నాగార్జున అడిగారు. ఇంతకుముందు చాలా తక్కువమంది కలవడానికి వచ్చే వాళ్లు. ఇప్పుడు కార్లు వేసుకుని వందల మంది వస్తున్నారు ఫొటోలు దిగుతున్నారని ఆనందంతో తెలిపింది. అలాగే తన ఇంటి కలను నెరవేర్చిన పెద్దన్న బిగ్​బాస్, చిన్నన్న నాగార్జునకు ధన్యవాదాలు చెప్పుకొచ్చింది. అయితే గంగవ్వ ఇంటి పనులకు సంబంధించి వీడియోను ఫినాలే రోజు ప్లే చేసి చూపించారు.