హైదరాబాద్ : కరోనా కొత్త రకం స్ట్రెయిన్ వైరస్ నేపథ్యంలో తెలంగాణ వైద్యశాఖ అప్రమత్తమైంది. గత వారం రోజుల్లో యూకే నుంచి వచ్చిన వాళ్లను వైద్యశాఖ ట్రాక్ చేయనుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కరోనా సర్వేలెన్సు ఏర్పాటు చేశారు. అక్కడే ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయడానికి ఏర్పాట్లు చేశారు. పాజిటివ్ వస్తే ఆస్పత్రికి తరలిస్తారు. నెగెటివ్ వస్తే వారం పాటు క్వారంటైన్ విధిస్తారు. స్ట్రెయిన్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను రద్దు చేసింది. కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయమని తెలిపింది. రేపు రాత్రి నుంచి ఈ నెల 31 వరకు బ్రిటన్‌కు విమానాలు బంద్ అని తెలిపింది. బ్రిటన్ మీదుగా భారత్‌కు వచ్చే వారిపై ఆంక్షలు విధించింది. భారత్ వచ్చాక ఆర్టీ పీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది.