వరంగల్ లో ఉద్యమకారుడి నిరసన
వరంగల్ అర్బన్ జిల్లా : తనను తమ పార్టీ కార్పొరేటర్ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందిన వరంగల్ అర్బన్ జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ సముద్రాల మధు టీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్, స్థానిక కార్పొరేటర్లు పట్టించుకోక పోవడం వల్లే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలంగాణ ఉద్యమకారుడు సముద్రాల మధు తెలిపారు.
అయితే తనను పార్టీ బహిష్కరించినట్లు కొంత మంది చిత్రీకరించడం తగదు అంటూ హన్మకొండ అదాలత్ సెంటర్ లోని అమరవీరుల స్థూపం వద్ద కుటుంబసభ్యులతో కలిసి నిరసనకు దిగారు. అమరవీరులకు నివాళులర్పించి, తనపై వస్తున్న ఆరోపణలు కొట్టిపారేయాలంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన తనను స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్లే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానని ఆవేదన వ్యక్తం చేశారు.