హైదరాబాద్ : సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వేళ్లే మార్గంలో రైల్వే ట్రాక్ పై మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు రాజు స్వగ్రామం జగనామ జిల్లా కొడకండ్ల గ్రామం. గత 20 యేండ్ల క్రితం బ్రతుకుదెరువు కోసం సింగరేణి కాలనీకి రాజు మకాం మార్చాడు. అయితే సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన అనంతరం తప్పించుకునే క్రమంలో స్వగ్రామం కొడకండ్లకు చేరుకునే ప్రయత్నంలోనే రాజు మృతదేహం గురువారం ఉదయం ఘట్ కేసర్ , వరంగల్ వేళ్లే మార్గంలో స్టేషన్ ఘన్ పూర్ రైల్వే ట్రాక్ పై లభ్యమైంది. మొదట
అయితే నిందితుని కోసం గత మూడ్రోజులుగా పోలీసులు వేట కొనసాగించారు. వందలాది మంది పోలీసులు రాజు కోసం వెతుకులాట మొదలుపట్టారు. హైదరాబాద్ సిటీ మొత్తం పోలీసులు నిందితుని కోసం జల్లెడ పట్టారు. బాధిత కుటుంబ సభ్యులతో పాటు, ప్రజల నుంచి కూడా నిందితుడు రాజును చంపేయాలన్నా డిమాండ్ తో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. అయితే పోలీసులకు దొరకకుండా రాజు ఆత్మహత్య చేసుకోవడం పట్ల బాధిత కుటుంబసభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిందితుడికి ప్రభుత్వమే సరైన శిక్ష వేసి, చంపి ఉంటే బాగుండని అన్నారు.
నిందితుడు కోసం పోలీసులు గాలింపు విస్తృతంగా చేపట్టడంతో భయాందోళనకు గురైన రాజు బలవన్మరానికి గురయ్యాడని పోలీసులు తెలిపారు. తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే స్వగ్రామానికి వెళ్తున్న నిందుతుడి దారి మధ్యలో బలవన్మరానికి గురైనట్లు పేర్కొన్నారు. నిందితుడి చేతులపై ఉన్న టాటూల ఆధారంగా రాజు డెడ్ బాడీగా హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ నిర్ధారించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు కూడా తెల్పడంతో పూర్తిగా నిర్ధార అయ్యిందని, కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి అధికారికంగా ప్రకటించనున్నట్లు సీపీ తెలిపారు.
అయితే నిందితుడిని పట్టుకునే విషయంలో పోలీసులు విఫలమయ్యాయని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని , నిందితులకు సరైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.
నిందితుడు రాజు మృతదేహం వరంగల్ ఎంజీఎం తరలింపు
జనగామ జిల్లా జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలం నష్కల్ రైల్వే స్టేషన్ పరిధిలో రైల్వే ట్రాక్ పై శవమై తేలిన నిందితుడు రాజు మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన వరంగల్ సీపీ, పోలీసుల బృందం నిందితుడిని గుర్తించి డెడ్ బాడీని వరంగల్ ఎంజీఎం కు తరలించారు. రాజు మృతదేహంపై మౌనిక అనే పేరుతో ఉన్న టాటూతో నిందితుడిని గుర్తించిన పోలీసులు , అతను బలవన్మరణానికి గురయ్యాడని తెలిపారు.
నిందితుడు రాజు ఆత్మహత్యపై మంత్రి కేటీఆర్ ట్వీట్..
ఆరేళ్ల చిన్నారి హత్యాచార కేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకోవడంపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. చిన్నారిపై హత్యాచారం చేసిన మృగం చనిపోయిందంటూ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. నిందితుడు రాజు మృతదేహం స్టేషన్ ఘన్ పూర్ రైల్వే ట్రాక్ పై ఉన్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తనకు సమాచారం ఇచ్చినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఇదే విషయంపై తెలంగాణ డీజీపీ కూడా అధికారికంగా ట్విట్టర్ ప్రకటన చేశారు. చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడైన రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు డీజీపీ ధ్రువీకరించారు. రాజు శరీరంపై ఉన్న గుర్తుల ఆధారంగా మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు. రాజు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని డీజీపీ పేర్కొన్నారు.