హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలిలోని చైర్మన్ ఛాంబర్ లో నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన డా. పల్లా రాజేశ్వర్ రెడ్డితో తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, వాణి దేవి, దామోదర్ రెడ్డి, పురాణం సతీశ్, తేరా చిన్నపరెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్ రావు, గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, భాస్కర్ రావు, నోముల భగత్ కుమార్ మరియు మాజీ ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, పాతూరి సుధాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి హాజరయ్యారు.