నవంబర్ 1న ‘స్కైలాబ్‌’ట్రైలర్ రిలీజ్

హైదరాబాద్ : స‌త్య‌దేవ్‌, నిత్యామీనన్, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా డా.రవి కిరణ్‌ సమర్పణలో బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తోన్న చిత్రం ‘స్కైలాబ్‌’. 1979 లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. ఈ మూవీ ట్రైల‌ర్‌ను న‌వంబ‌ర్ 1న విడుద‌ల చేస్తున్నారు. అలాగే సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన పలు అంశాలపై చిత్ర ద‌ర్శ‌కుడు విశ్వక్ ఖండేరావు మాట్లాడారు. ‘‘1979 సంవ‌త్సరంలో మన తెలుగు రాష్ట్రంలో బండ లింగపల్లి అనే గ్రామంలో కొన్ని విచిత్ర‌మైన ప‌రిస్థితులు జరిగాయి. అమెరికా స్పేస్ స్టేష‌న్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేష‌న్ స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ప్రపంచమంతా అసలేం జరగబోతుందోనని ఊపిరి బిగపట్టి ఎదురుచూడసాగారు. వార్తాపత్రికలు ఈ వార్తను ప్రముఖంగా కవర్‌ చేశాయి. ఈ నేప‌థ్యంలో ఆ గ్రామంలో ఉండే గౌరి, ఆనంద్‌, రామారావుల జీవితాల్లో స్కైలాబ్‌ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను ఎంటర్‌టైనింగ్‌గా చెప్పే ప్ర‌య‌త్న‌మే ఈ చిత్రం అని దర్శకుడు విశ్వక్ ఖండేరావు పేర్కొన్నారు.

ఇందులో ఆనంద్‌గా స‌త్య‌దేవ్‌, గౌరీగా నిత్యామీనన్,సుబేదార్ రామారావుగా రాహుల్ రామ‌కృష్ణ క‌నిపించ‌నున్నారని దర్శకుడు విశ్వక్ ఖండేరావు తెలిపారు. వీరి పాత్ర‌ల‌కు సంబంధించిన లుక్స్‌ను విడుద‌ల చేసినట్లు వెల్లడించారు. ఆర్టిసులు స‌హా అద్భుత‌మైన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు కుదిరారు. అనుకున్న ప్లానింగ్‌లోనే సినిమాను పూర్తి చేశాం. ఇప్పుడు సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్యక్ర‌మాలు జ‌రుగుతున్నాయి. మెసడోనియన్ సింఫనీ ఆర్కెస్ట్రాతో సినిమాలో థీమ్స్‌ను రికార్డ్ చేయించాం.న‌వంబ‌ర్ 1న ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్నాం. త్వ‌ర‌లోనే సినిమాను థియేట‌ర్స్‌లో సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నాం’’అని విశ్వక్ ఖండేరావు తెలిపారు.

న‌టీన‌టులు :
నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్ రామ‌కృష్ణ, తనికెళ్ల భరణి, తులసి, విష్ణు, అనుష త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు :
మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం : విశ్వక్ ఖండేరావు
నిర్మాత : పృథ్వీ పిన్నమరాజు
సహ నిర్మాత : నిత్యామీనన్‌
సినిమాటోగ్రఫీ : ఆదిత్య జవ్వాది
ఎడిటర్‌ : రవితేజ గిరిజాల
మ్యూజిక్‌ : ప్ర‌శాంత్‌ ఆర్‌.విహారి
ప్రొడక్షన్‌ డిజైన్‌ : శివం రావ్‌
సౌండ్ రికార్డిస్ట్‌‌ : నాగార్జున త‌ల్ల‌ప‌ల్లి
సౌండ్‌ డిజైన్‌ : ధ‌నుష్ న‌య‌నార్‌
కాస్ట్యూమ్స్‌ : పూజిత తడికొండ
పి.ఆర్‌.ఒ : వంశీ కాక