బెంగళూర్ : కన్నడ క్రేజీ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ఆదివారం జరుగనున్నాయి. అమెరికాలో ఉన్న ఆయన కూతురు ధృతి బెంగుళూరుకు వచ్చింది. ఉన్నత చదువుల కోసం ఆమె అమెరికా వెళ్లింది. బెంగళూరు ఎయిర్ పోర్టులో దిగిన ఆమెను ఎలాంటి ట్రాఫిక్ లేకుండా పోలీసులు కంఠీరవ స్టేడియానికి తీసుకొచ్చారు. కూతురు ధృతి కోసమే పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ఒక రోజు వాయిదా వేశారు.
అక్టోబర్ 31 ఆదివారం ఉదయం పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ప్రభుత్వం లాంఛనాలతో జరుగనున్నాయి. కర్ణాటక సినీ , రాజకీయ ప్రముఖులు అందరూ ఈ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. అయితే పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ కు ఇద్దరు కుమార్తెలు కావడంతో అంత్యక్రియలు ఆయన అన్న కుమారుడు వినయ్ రాజ్ కుమార్ చేతుల మీదుగా జరుగనున్నాయి.