నగర అభివృద్ధే టీఆర్ఎస్ లక్ష్యం: దాస్యం

వరంగల్ అర్బన్ జిల్లా : నగర అభివృద్ది పై ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. పశ్చిమ నియోజవర్గంలోని 48డివిజన్ లో రూ.25 లక్షల వ్యయంతో చేపట్టనున్న సి.సి రోడ్డు, డ్రైనేజీ పనులకు దాస్యం వినయ్ భాస్కర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ మౌలిక సదుపాయాలకు వివిధ పథకాల ద్వారా చేపట్టి స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ముందుకు పోతున్నట్లు వివరించారు. కరోనా వైరస్ ప్రభావితం కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరం ఉంటేనే బయటికి వెళ్లాలని కోరారు. వివిధ షాపుల్లో, జనరల్ స్టోర్స్ వద్ద భౌతిక దూరం పాటించాలని, చేతులు సానిటైజ్ చేసుకుని, ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు. ఫంక్షన్లు జరిగే సందర్భంలో ప్రజలు నిబంధనలు పాటించాలని సూచించారు. ఎవ్వరికీ వారే స్వీయ నియంత్రణ పాటించి వైరస్ ను దరిచేయనీయవద్దని చీఫ్ విప్ కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బోయిన పల్లి సంపత్ రావు, కూడా సలహా కమిటీ సభ్యుడు దొంతు రవీందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు సబితా రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.