హన్మకొండ జిల్లా : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులే తమను గెలుపు దిశగా తీసుకెళ్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాల టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. పోచంపల్లి శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే గతంలో తాను ఎమ్మెల్సీగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం చేసిన అభివృద్ధి పనులు తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చాయని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రెండో సారి తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు, సహకరించిన ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
డబుల్ బెడ్ రూంల ఇళ్ల నుంచి మొదలుకుంటే చారిత్రక ప్రసిద్ధి గాంచిన రామప్పదేవాలయంకు యునెస్కో గుర్తింపులో తనవంతు పాత్ర ఉందని చెబుతున్నారు. అంతేకాకుండానిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో తాను ప్రధాన పాత్ర పోషిస్తానని చెబుతున్నారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.