తిరుమల : శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. జనవరి 1వ తేదీన సిఫార్సు లేఖల స్వీకరణ ఉండదని స్పష్టం చేసింది. అంతేకాకుండా జనవరి 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కూడా సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది.
జనవరి 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ను కూడా రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులుకు కరోనా వ్యాక్సినేషన్ లేదా కరోనా నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి అని టీటీడీ మరోసారి స్పష్టం చేసింది.