హైదరాబాద్ : హీరో మంచు మనోజ్ కరోనా బారినపడ్డాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని తెలిపాడు. గత వారం రోజులుగా తనను కలిసిన వాళ్లందరూ కరోనా పరీక్షలు చేయించుకొని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు.
తన గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాను క్షేమంగానే ఉన్నానని చెప్పాడు. ఎప్పటికీ మీ ప్రేమ, ఆశీర్వాదాలు తనతోనే ఉంటాయని, తనకు ఏమీకాదని అన్నాడు. తనకు చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులకు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపాడు.