సీఎంకు థ్యాంక్స్ చెప్పిన ప్రధాని మోడీ

పంజాబ్ : పంజాబ్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. పంజాబ్ పర్యటన అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ప్రధాని మోడీ భటిండా ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి అధికారులతో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మీ సీఎంకు ధన్యవాదాలు తెల్పండి. భటిండా ఎయిర్ పోర్టు వరకూ సురక్షితంగా , ప్రాణాలతో చేరుకోగలిగా’ అంటూ మోడీ అక్కడి అధికారులతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.