బస్టాండ్ జంక్షన్ అభివృద్ధి పనులకు దాస్యం భూమి పూజ

బస్టాండ్ జంక్షన్ అభివృద్ధి పనులకు దాస్యం భూమి పూజ

వరంగల్ టైమ్స్, హన్మకొండ: లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేదలతో పాటు, పలు వర్గాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ ఆకలితీరుస్తున్న ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అభివృద్ధి పనుల ప్రారంభంలోనూ ముందే వుంటున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని తన పశ్చిమనియోజకవర్గంలో ప్రజలకు కరోనావైరస్ నియంత్రణపై అవగాహన కల్పిస్తూనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు.ఇందులో భాగంగానే రూ. కోటి 90లక్షలతో చేపట్టనున్న హన్మకొండ బస్టాండ్ జంక్షన్ అభివృద్ధి పనులను దాస్యం వినయ్ భాస్కర్ భూమి పూజచేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పమేలా సత్పతి, కుడా ప్లానింగ్ ఆఫీసర్ అజిత్ రెడ్డి, కార్పోరేటర్ వేముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే హన్మకొండలో పెండింగ్ లో వున్న ఇతర అభివృద్ధిపనులను త్వరితగతిన పూర్తిచేస్తామని దాస్యం వినయ్ భాస్కర్ నగరవాసులకు హామీ ఇచ్చారు.