2 రోజుల పాటు సీపీఐఎం కేంద్ర కమిటీ సమావేశాలు

హైదరాబాద్ : నేటి నుండి రెండు రోజుల పాటు హైదరాబాద్ లో సీపీఐఎం కేంద్ర కమిటీ సమావేశం నిర్వహించనుంది. జనవరి 7-9 మధ్య సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాలు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగనున్నాయి.

ఈ కేంద్ర కమిటీ సమావేశాలకు ముఖ్యఅతిథిగా పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ సీఎం పినరయి విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్, ఇతర నేతలు తదితరులు హాజరుకానున్నారు.