రైల్వే ఉద్యోగుల పోరాటం ఫలించింది

వరంగల్ అర్బన్ జిల్లా: ప్రజాప్రతినిధులు , రైల్వే ఉద్యోగుల ఐక్య పోరాటం వలనే రైల్వే పి.ఓ.సి సెంటర్ మంజూరయ్యిందని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఆ దిశగా 160 ఎకరాల భూసేకరణ పూర్తయ్యిందని, ఆ భూమిని త్వరలో రైల్వే కు అప్ప జెప్పనున్నట్లు ఆయన తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట అయోధ్యపురంలో ఏర్పాటు చేయనున్న పి.ఓ.సి.సెంటర్ కు సంబంధించిన భూసేకరణను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పరిశీలించారు. ప్రభుత్వ చీఫ్ విప్ తో పాటు ఎంపి పసునూరి దయాకర్ , వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ , జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు , ఇతర అధికారులు కలిసి రైల్వే వ్యాగన్ స్థలాన్ని పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం
318 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పిరియాడికల్ ఓవరైలింగు సెంటర్ కు సేకరించిన భూమిని వేగవంతంగా రైల్వే శాఖ కు కేటాయింపులు చేసే దిశగా జిల్లా మంత్రులు ఎం.పి లు, ఎమ్మెల్యేలు కలిసి సోమవారం రోజు సిఎం కేసీఆర్ కు, కేటీఆర్ ను
కలిసి విన్నవించనున్నట్లు వర్ధన్న పేట ఎమ్మెల్యే అరూరి రమేష్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఈ సందర్భంగా వెల్లడించారు.