నాచ్ ఘోడా ( గుర్రం ) ఎక్కిన బాలయ్య

నాచ్ ఘోడా ( గుర్రం ) ఎక్కిన బాలయ్య

వరంగల్ టైమ్స్, ప్రకాశం జిల్లా: ఈరోజు వార్తలు::- నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఞ తో కలసి ప్రకాశం జిల్లాలో సంక్రాంతి సంబరాలను తమ కుటుంబ సభ్యులతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. జిల్లాలోని కారంచేడులో దగ్గుబాటి పురందేశ్వరి ఇంటి వద్ద సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ ఏడాది సంక్రాంతి పండగను బాలకృష్ణ కారంచేడు లోని సోదరి దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో సందడి చేశారు.

బాలయ్య తన భార్య వసుంధర, కొడుకు మోక్షజ్ఞ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకొంటున్నారు. బాలకృష్ణ నాచ్ ఘోడ గుర్రమెక్కి కొద్దిసేపు కుటుంబసభ్యులను అలరించారు. అనంతరం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ గుర్రం ఎక్కగా.. బాలకృష్ణ గుర్రం కళ్ళెం పట్టుకుని అదుపుచేశారు. బాలకృష్ణ కుటుంబాన్ని చూసేందుకు భారీగా అభిమానులు చుట్టుపక్క గ్రామాల నుండి తరలి వచ్చారు. ఈ వేడుకల్లో లోకేశ్వరి, ఉమామహేశ్వరి సహా బంధువులు పాల్గొన్నారు..