మరోసారి కోవిడ్ బారిన పడ్డ తెలంగాణ స్పీకర్..!

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మరోసారి కరోనా వైరస్‌ సోకింది. శనివారం స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్ట్ చేయించగా కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.ఎటువంటి సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో స్పీకర్ పోచారం జాయిన్ అయ్యారు.గత కొన్ని రోజులుగా తనను కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కోవిడ్ టెస్ట్ చేయించుకుని తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో ఆయన మొదటిసారి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.