హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తోన్న చిత్రం ‘ఆచార్య ’..ఉగాది సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 1న గ్రాండ్ రిలీజ్.
మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య’. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉగాది సందర్భంగా.. ఏప్రిల్ 1 విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా …
చిత్ర నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివగారు రూపొందిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేయాలనుకున్నాం. కానీ కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయడం భావ్యం కాదనిపించింది.
అందువల్ల సినిమాను ఫిబ్రవరి 4న కాకుండా ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తున్నాం. ఎన్నో అంచనాలు పెట్టుకున్న సినిమా వాయిదా పడటం అనేది మెగా ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించే అంశమే. అయితే, ఈ వెయిటింగ్‌కు తగ్గ ఫలితం ఉంటుందని గ్యారంటీగా చెప్పగలం. ఉగాది సందర్భంగా ‘ఆచార్య’ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఫ్యాన్స్ ఎంత ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నారో మేం కూడా అంతే ఎగ్జయిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాం’’ అన్నారు.