రెండో వన్డేలోనూ టీంఇండియా ఓటమి

స్పోర్ట్స్ డెస్క్ : సౌతాఫ్రికా – టీం ఇండియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ను సఫారీలు సొంతం చేసుకున్నారు. శుక్రవారం జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో టీంఇండియా నిర్దేశించిన 288 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లు మరో 11 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో చేధించారు. దీంతో 3 వన్డే మ్యాచ్ ల సిరీస్ ను 2-0 తేడాతో సౌతాఫ్రికా సొంతం చేసుకుంది. సౌతాఫ్రికా ఓపెనర్లలో మలన్ 108 బంతులాడి 91 (8 ఫోర్లు, ఒక సిక్సర్), క్వింటాన్ డికాక్ 66 బంతుల్లో 78 ( 7 ఫోర్లు, 3 సిక్సులు) రన్స్ చేశారు. డసెన్ 37, బవుమా 35 పరుగులు చేశారు.

టీంఇండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, బుమ్రా, చాహల్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. 288 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా ఓపెనర్లలో డికాక్ దూకుడుగా ఆడాడు. మలన్ నిలకడగా బ్యాటింగ్ చేశాడు. 10 ఓవర్లకే సౌతాఫ్రికా ఒక వికెట్ పోకుండానే 66 పరుగులు చేసింది. 37 పరుగుల్లో డికాక్ అర్థ శతకం బాదాడు. తర్వాత మలన్ దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.