విడాకులు తీసుకోనున్న మెగా డాటర్ !
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ మరియు హాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఏదైనా సెలబ్రిటీల విడాకులు వార్తల్లో నిలుస్తున్నాయి. టాలీవుడ్ లో ఇటీవల నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. నిన్న కోలీవుడ్ లో తమిళ్ స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడిపోయినట్లు ప్రకటించారు. తాజాగా టాలీవుడ్ లో మరో జంట విడిపోనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ ‘మెగాస్టార్ ‘ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, ఆమె భర్త కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకోబోతున్నారట. నిజానికి వీరిద్దరి విషయంపై గత కొన్ని నెలల నుంచే సోషల్ మీడియలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఇటీవలి కాలంలో కళ్యాణ్ మెగా సెలబ్రేషన్స్ లో ఎక్కడా కనిపించలేదు. శ్రీజ పోస్ట్ లో కూడా ఉండేవాడు కాదు. కళ్యాణ్ దేవ్ చేసిన పోస్ట్ లో కూడా శ్రీజ కనిపించేది కాదు. ఇటీవల జరిగిన మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదు. సంక్రాంతికి విడుదలైన కళ్యాణ్ సినిమా ‘సూపర్ మ చ్చి’ కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు. ఇక తాజాగా శ్రీజ తన ఇన్ స్టాగ్రామ్ లో అకౌంట్ పేరుని మార్చేశారు. అంతకు ముందు భర్త కళ్యాణ్ దేవ్ పేరును కలిపి ‘శ్రీజ కళ్యాణ్ ‘ పేరును పెట్టుకున్న శ్రీజ – కళ్యాణ్ పేరును డిలీట్ చేసి తండ్రి ఇంటి పేరు కొణిదెలను యాడ్ చేసి ‘శ్రీజ కళ్యాణ్’ గా మార్చారు. దీంతో ఇన్ని రోజులుగా వినిపించిన రూమర్లే నిజమా అని అందరూ అనుకుంటున్నారు.
శ్రీజకు కళ్యాణ్ దేవ్ రెండవ భర్త. 2007లో శిరీష్ భరద్వాజ్ ను ఆర్య సమాజ్ లో ప్రేమ వివాహం చేసుకుంది శ్రీజ. అతనితో 2014లో విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే. కళ్యాణ్ దేవ్ , శ్రీజకు ‘నవిష్క’ అనే పాప ఉంది. చిరంజీవి అల్లుడిగా మారాక కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని సినిమాలు తీసినప్పటికీ, అవి ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయాయి. ‘సూపర్ మచ్చి’ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
గతంలో స్టార్ హీరోయిన్ సమంత కూడా ఇలానే చేశారు. అక్కినేని అనే పేరును తొలగించడంతో విడాకుల రూమర్లు రావడం ప్రారంభించాయి. చివరకు అవే నిజమయ్యాయి.