హైదరాబాద్ : పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి విడత ప్రవేశాలకు జనవరి 25 నుంచి 27 మధ్యాహ్నం 2 గంటల వరకు తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. వర్సిటీ పరిధిలోని కాలేజీలు, నిమ్స్ మెడికల్ కాలేజీలోని కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. కాళోజీ యూనివర్సిటీ వెబ్ సైట్ లో సీట్ల ఖాళీల వివరాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. నేడు ఉదయం 8 గంటలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ను www.knruhs.telangana.gov.in లో చూడాలని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.