స్పోర్ట్స్ డెస్క్ : ఎంతో ఉత్కంఠంగా సాగిన టీ 20 పోరులో ఇంగ్లండ్ ఓ పరుగు తేడాతో వెస్టిండీస్ పై విక్టరీ సాధించింది. చివరి ఓవర్లో విజయానికి 30 రన్స్ అవసరం కాగా, మూడు సిక్సర్లు, 2 ఫోర్లు బాదిన అకీల్ హుసేన్ ( 16 బంతుల్లో 44 నాటౌట్ ; 3ఫోర్లు, 4 సిక్సర్లు ) 28 పరుగులు రాబట్టడంతో ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
జాసన్ రాయ్ (45), మోయిన్ అలీ (31) రాణించారు. విండీస్ బౌలర్లలో హోల్డర్, అలెన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైన చోట షెఫర్డ్ ( 44 నాటౌట్ ; 1 ఫోర్ , 5 సిక్సర్లు), అకీల్ హుసేన్ చివరిలో రాణించినా ఫలితం లేకపోయింది.