కేంద్రం, ఈసీకీ సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : కేంద్రం, ఎన్నికల సంఘంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఎన్నికల టైంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత వాగ్దానాలపై మార్గదర్శకాలను రూపొందించాలని తమ నోటీసుల్లో సుప్రీం పేర్కొంది. రెగ్యులర్ బడ్జెజ్ కన్నా, ఉచిత బడ్జెట్ హద్దులు దాటుతోందని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులను దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ నేత అశ్వినీ ఉపాధ్యాయ కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ కేసులు ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారించింది. జస్టిస్ ఏఎస్ బొప్పన్న, జస్టిస్ హిమా కోహ్లీలు కూడా ఈ బెంచ్ లో ఉన్నారు.

ఉచిత వాగ్ధానాల అంశంపై గైడ్ లైన్స్ ను రూపొందించాలని ఇప్పటికే ఈసీని కోరినట్లు సీజే తెలిపారు. కానీ మా ఆదేశఆల తర్వాత ఈసీ ఒకేసారి ఈ అంశంపై భేటీ అయిందని తెలిపారు. రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని ఈసీ కోరిందని, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తమకు తెలియదని రమణ తెలిపారు. ఉచిత వాగ్ధానాలు ఇచ్చి నెరవేర్చని పార్టీల గుర్తులను సీజ్ చేయాలని, ఆ పార్టీల గుర్తింపును రద్దు చేయాలని పీల్ లో కోరారు.