లాల్ చౌక్‌లో ఫస్ట్ టైం రెపరెపలాడిన త్రివ‌ర్ణ ప‌తాకం

శ్రీనగర్‌ : స్వాతంత్య్రానంతరం భారతదేశంలో అనేక దశాబ్దాల తర్వాత శ్రీనగర్‌లోని ఘంటా ఘర్‌పై త్రివర్ణ పతాకం స‌గ‌ర్వంగా ఎగిరింది. 73వ రిపబ్లిక్ డే వేడుక‌ల సంద‌ర్భంగా స్థానిక క్లాక్ ట‌వ‌ర్ వ‌ద్ద ఇద్ద‌రు వ్య‌క్తులు సాజిద్ యూసుఫ్ షా, సాహిల్ బషీర్ భట్ లు జాతీయ జెండాను బుధ‌వారం ఆవిష్క‌రించారు.

గ‌తంలో ఇదే ప్రాంతంలో జనవరి 26న‌ పాకిస్తాన్ జెండాను ఎగుర వేసేవారు. లేదంటే ఈ రోజు 144 సెక్ష‌న్ విధించేవారు. ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో జెండా ఎగుర‌వేయ‌లేదు. సున్నిత‌మైన ప్రాంతంగా పేర్కొంటూ శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో తిరంగ జెండాను ఎగురు వేసేందుకు అనుమ‌తి ఇవ్వ‌లేదు.