గాడ్సే పోస్ట్‌పై క్లారిటీ ఇచ్చిన మెగా బ్ర‌ద‌ర్

హైదరాబాద్: మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు మే 19న నాధురాం గాడ్సే జ‌యంతిని పుర‌స్క‌రించుకొని సంచ‌ల‌న ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే. ‘ఈ రోజు నాథురాం గాడ్సే పుట్టినరోజు. గాంధీని చంపడం కరెక్టా ?కాదా? అనేది  చర్చనీయాంశమే.  కానీ అతనివైపు అర్గ్యూమెంట్‌ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. గాంధీని చంపితే అపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ నాథురాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. నాథురాం పుట్టినరోజు సందర్భంగా ఆయనని ఒకసారి గుర్తుచేసుకోవాల అనిపించింది. పాపం నాథురాం గాడ్సే’ అంటూ  నాగబాబు ట్వీట్‌ చేశారు. అంతేకాదు నాథురాం గాడ్సే మరణ వాంగ్మూల అనువాదానికి సంబంధించిన  ఓ వీడియోను క్లిప్ ను పోస్ట్‌ చేశారు. గాడ్సే గురించి నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వివాదస్పదంగా మారాయి. ఈ నేప‌థ్యంలో నాగ‌బాబు మ‌రో పోస్ట్ ద్వారా స్పందించారు. ‘దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి అన్నారు. నేను నాధురాం గురించి ఇచ్చిన ట్వీట్ లో నాధురాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు. నాధురాం వెర్షన్ కూడా జనానికి తెలియాలి అని మాత్రమే అన్నాను. మహాత్మ గాంధీ అంటే నాకు చాలా గౌరవం. ఇన్ఫాక్ట్ నన్ను విమర్శించే వల్లకన్నా నాకు ఆయనంటే చాలా గౌరవం’ అంటూ గాడ్సే పోస్ట్‌పై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు నాగ‌బాబు.