హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటిస్తున్న ఆచార్య మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఆచార్య సినిమా పోస్ట్ పోన్ చేస్తున్నట్లు కొణిదెల ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటిస్తూ ట్వీట్ చేసింది. ఫిబ్రవరి 4న ఈ మూవీ విడుదల కావాల్సి ఉండే. కానీ కరోనా ఉధృతి దృష్ట్యా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది.
త్వరలోనే ఆచార్య విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. ప్రతీ ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కొణిదెల ప్రొడక్షన్స్ విజ్ఞప్తి చేసింది. ఈ సినిమాలో కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. దేశంలో ఒమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతుండటంతో సంక్రాంతికి విడుదల కావాల్సిన భారీ బడ్జెట్ సినిమాలు వాయిదాపడిన సంగతి తెలిసింది. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాలు వాయిదా పడటంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు.