శానిటైజర్ తాగి ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం
అనంతపురం: అనంతపురంలో శానిటైజర్ తాగి ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గా రమణ విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబ కలహాలతో ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలుస్తోంది. కలెక్టరేట్ ఆవరణలో శానిటైజర్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన రమణను తోటి సిబ్బంది గుర్తించి హుటాహుటిన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.